- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ రియక్షన్ ఇదే.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి అల్లు అర్జున్(Allu Arjun) వివాదాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ (Sandhya Theatre)సంఘటన రోజు రోజుకు ఆయనను చిక్కుల్లో పడేస్తోంది. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సమావేశాల్లో బన్నీపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట మరోసారి దుమారం రేపుతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రెస్‌మీట్ పెట్టి తన తప్పులేదని చెప్పడంతో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ప్రీమియర్ షోలకు ఆయన రోడ్ షో చేసిన వీడియోలను షేర్ చేస్తూ అక్కడికి వెళ్లడమే కాదు రెండు గంటలు ఉండి మహిళ మృతి చెందినా పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళవారం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అల్లు అర్జున్ వివాదం గురించి ఇటీవల లైంగిక ఆరోపణల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జానీ మాస్టర్(Jani Master) స్పందించారు.
ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నర్స్ జైలుకి వెళ్లి వచ్చారు కాదా దీనిపై మీరు ఏమంటారు అని యాంకర్ అడగ్గా.. దానికి జానీ మాస్టర్ సమాధానమిస్తూ.. ‘‘ఈ విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను కూడా ఒక ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్(Jani Master) కామెంట్స్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి.