NTR: ఎన్టీఆర్‌పై సంచలన ఆరోపణలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ హీరోయిన్ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-12-24 05:00:28.0  )
NTR: ఎన్టీఆర్‌పై సంచలన ఆరోపణలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ హీరోయిన్ (పోస్ట్)
X

దిశ, సినిమా: తమ అభిమాన హీరో కోసం అభిమానులు ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారన్న విషయం తెలిసిందే. హీరోలు కూడా అప్పుడప్పుడు తమ అభిమాని ఎవరైనా ఆపదలో ఉంటే తోచినంత సాయం చేస్తుంటారు. అయితే గతంలో ఎన్టీఆర్(NTR) వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్‌తో పోరాడుతుండగా.. అతడి కోరిక మేరకు తారక్ వీడియో కాల్(Video call) చేసి మాట్లాడిని విషయం తెలిసిందే. అంతేకాకుండా తను అతని చికిత్సకు సాయం అందిస్తానని తన కౌశిక్ తల్లికి మాటిచ్చారు.

సాయం చేసారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన మాటను నిలబెట్టుకోలేదని కౌశిక్(Kaushik) తల్లి సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా.. దీనిపై టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత(Maadhavilatha) ఈ వీడియో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఐతే ఏం చేద్దాం. ఏ రకంగా ఫ్యాన్స్‌కి డబ్బలిస్తూ పోతే హీరోలు రోడు మీద పడి అడుక్కుతింటారు.

అభిమాని అంటే ఆశించేవాడు కాదు అందుకే అభిమాని అంటారు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం. ఆశిస్తే స్వార్థం అవుద్ది కానీ అభిమానం ఎలా అవుద్ది? ఇంకా రోజుకొకరు వస్తారు బయటికి మాకు సాయం చేయమని. స్టోరీస్ పట్టుకుని ఫిల్మ్ నగర్‌(Film Nagar)లో చాలామంది తిరుగుతారు అదృష్టం ఉంటే అవకాశం వస్తది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం మాధవీలత పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు కొందరు మండిపడుతున్నారు. మరికొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed