- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు
దిశ,వెబ్‌డెస్క్: ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ కొనసాగుతోంది. పచ్చని చెట్లతో రమణీయంగా ఉండే ఇంద్రకీలాద్రి.. భవానీ దీక్షధారులతో ఎరుపు రంగు పులుముకుంది. అయితే డిసెంబర్ 21 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీల విరమణ దీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపటి(డిసెంబర్ 25) వరకు భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈ భవానీ దీక్షల విరమణకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. నాలుగో రోజు(మంగళవారం) భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లో 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షలకు పైగా లడ్డూల విక్రయాలు జరిగాయి. ఈనెల 29న దీక్షల విరమణ ఉండటంతో భారీగా లడ్డూల తయారీతో పాటు అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ రోజైన సోమవారం 63 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం భవానీ దీక్షాధారులు వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.