Viral video: అక్కడ రూ. 117కే హోటల్ గది.. సౌకర్యాలు చూస్తే మతి పోవాల్సిందే

by Prasanna |
Viral video: అక్కడ రూ. 117కే హోటల్ గది.. సౌకర్యాలు చూస్తే మతి పోవాల్సిందే
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనలో కొంతమందివ్లాగర్స్‌ గా మారి మనకి తెలియని విషయాలు కూడా చెబుతున్నారు. దీని వల్ల ఆ ప్రదేశంలో ఏవేమి ఉన్నాయో కూడా తెలుస్తున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి వీడియెనే నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది ప్రజలందరూ షాక్ అవుతున్నారు.

టామ్ అనే వ్లాగర్ కొత్త కొత్త దేశాలకు వెళ్తూ.. అక్కడ తెలియని విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అలా ఖాళీ లేకుండా ఎప్పుడూ ఏదొక దేశం వెళ్లే .. అతడు పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ హోటల్ రూమ్స్ ధరలను చూసి ముందు షాక్ అయి తర్వాత సంతోషంగా ఫీల్ అయ్యాడు. అసలు అతను ఆ ధరను చూసి ఎందుకు షాక్ అయ్యాడో ఇక్కడ తెలుసుకుందాం..

అక్కడ హోటల్ రూమ్ ధర రూ. 117 మాత్రమే. అవును మీరు చదువుతున్నది నిజమే.. ధర ఇంత తక్కువగా ఉంది కదా.. సౌకర్యాలు ఉంటాయో ? ఉండవో అని సందేహిస్తున్నారా.. దానికి కూడా సమాధానం ఉంది. మీరు అలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు అతనికిచ్చిన గదిలో రెండు బెడ్లు, చిన్న టీవీ కూడా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి చాలా వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వస్తున్నాయి. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

(Video link credits to traveltomtom instagram id)

Advertisement

Next Story