మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉందా.. ప్రశాంతత ఉన్నట్లే.. (Meme Of The Day)

by Anjali |
మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉందా.. ప్రశాంతత ఉన్నట్లే.. (Meme Of The Day)
X

దిశ, ఫీచర్స్: స్మార్ట్ ఫోన్ మన జీవితంలో అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఫోన్ చేతిలో ఉంటే చాలు మరో వ్యక్తితో సంబంధం లేకుండా గడిపేస్తున్నారు. ఈ మొబైల్స్ వచ్చాక వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటున్నాయని, నిరాశ, ఒంటరితనం, ఆందోళన పెరుగుతున్నాయని రీసెంట్‌గా ఓ పరిశోధనలో కూడా వెల్లడైంది. ఫోన్ వాడకం ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టినప్పటికీ.. తాజాగా మీమర్స్ దీనిపై ఓ ఫన్నీ మీమ్ వేసుకున్నారు. ‘ఎవరింట్లో అయితే గొడవల్లేకుండా ప్రశాంతంగా ఉంటుందో.. వాళ్లింట్లో అందరూ మొబైల్స్ వాడుతున్నారని అర్థం’ అంటూ నెట్టింట ఓ మీమ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ మీమ్‌ను జనాలు వైరల్ చేస్తున్నారు.



Advertisement

Next Story

Most Viewed