CAG: కాగ్ నూతన చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ నియామకం

by Ramesh Goud |   ( Updated:2024-11-19 05:16:35.0  )
CAG: కాగ్ నూతన చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్/ కాకినాడ జిల్లా ప్రతినిధి: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(Comptroller and Auditor General) పదవిలో తెలుగు అధికారి(Telugu Officer) నియామకం అయ్యారు. కాగ్‌ కు కొత్త చీఫ్(CAG Chief) గా అమలాపురానికి చెందిన ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి(IAS Officer K.Sanjay Murthy)ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్(Himachal Pradesh Cadre) నుంచి ఐఏఎస్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నియామకం మేరకు ఈ నెల 21న ఐఏఎస్ సంజయ్ మూర్తి కాగ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కాగ్ చీఫ్‌గా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము(Girish Chandra Murmu) పదవీకాలం నవంబర్ 20‌తో ముగియనుండటంతో ఈ పదవిలో కేంద్రం సంజయ్ కుమార్‌ను నియమించింది.

అమలాపురం (Amalapuram) మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి (KSR Murthy) కుమారుడైన సంజయ్ మూర్తి (Sanjay Murthy) 1964 డిసెంబరు 24న జన్మించారు. మెకానికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు. 1989 సివిల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఆయన 2002-07 మధ్యకాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ, ఐటీ మంత్రిత్వ శాఖల్లో పని చేశారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌‌లో మూడేళ్లు కొనసాగారు. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రెటరీగా ఉన్నారు. అక్టోబరు 1, 2021 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన విధానాలను పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలును నిర్ధారించడం, దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధిని ప్రోత్సహించేలా విద్యా సంస్థలకు సహకరించడం వంటి కీలక బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ఆయన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ మూర్తి నవంబరు 21న బాధ్యతలు చేపడతారు.

Advertisement

Next Story

Most Viewed