China : భారత్‌కు చేరువ కావడమే లక్ష్యం : చైనా

by Hajipasha |
China : భారత్‌కు చేరువ కావడమే లక్ష్యం : చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో : బ్రిక్స్ సదస్సు వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌(Xi Jinping) అవగాహనకు వచ్చిన ఉమ్మడి అంశాలకు కట్టుబడి నడుచుకుంటామని చైనా(China) ప్రకటించింది. ఇరుదేశాల నడుమ పరస్పర విశ్వాసం, సహకారం, సమన్వయాలను పెంచేందుకే తాము అన్ని రకాల చర్యలను చేపడతామని వెల్లడించింది. సోమవారం బీజింగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఈవివరాలను తెలిపారు.

‘‘బ్రెజిల్‌లో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా మోడీ, జిన్‌పింగ్ మళ్లీ సమావేశమవుతారా ?’’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘తప్పకుండా ఇరుదేశాలు చేరవయ్యే ప్రయత్నాలే చేస్తాయి’’ అని లిన్ జియాన్ చెప్పారు. అయితే బ్రెజిల్‌లో చైనా, భారత్ ప్రభుత్వాధినేతల భేటీపై తనకు నిర్దిష్ట సమాచారమేదీ లేదని ఆయన తెలిపారు.

Advertisement

Next Story