CSL Recruitment: కొచ్చిన్ షిప్‌యార్డ్ లో ఉద్యోగ అవకాశాలు.. ఖాళీలు,జీతం తదితర వివరాలివే..!

by Maddikunta Saikiran |
CSL Recruitment: కొచ్చిన్ షిప్‌యార్డ్ లో ఉద్యోగ అవకాశాలు.. ఖాళీలు,జీతం తదితర వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన కేరళ(Kerala)లోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(CSL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్(Senior Project Officer) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cochinshipyard.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 3 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ - 03

విద్యార్హత:

కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి:

35 ఏళ్లకు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 47,000, రెండో ఏడాది రూ. 48,000, మూడో ఏడాది నుంచి రూ. 50,000 వరకు జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed