- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: ఫిర్యాదుల వ్యవహారంలో బ్యాంకుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్‌బీఐ గవర్నర్
దిశ, బిజినెస్ బ్యూరో: వినియోగదారులకు అందించే సేవల విషయంలో బ్యాంకులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో పాల్గొన్న దాస్.. బ్యాంకులకు వచ్చే ఫిర్యాదులను 'కస్టమర్ క్వైరీ'లుగా వర్గీకరించే సందర్భాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వినియోగదారు ఆధారిత బ్యాంకులు వారికందించే సేవల విషయంలో నిబద్ధతను చూపించాలని బ్యాంకు బోర్డులను కోరారు. బ్యాంకింగ్ రంగానికి నమ్మకమే అసలైన పునాది. పరిశ్రమ స్థిరత్వం, వృద్ధికి డిపాజిటర్లు, పెట్టుబడిదారులు విశ్వాసంపై ఆధారపడుతుందని దాస్ పేర్కొన్నారు. ఆ నమ్మకాన్ని పటిష్టం చేసుకోవడం, కొనసాగించడం కోసం బ్యాంకులు తమ కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవలు, విధానాలను కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా చూసుకోవడమేనని చెప్పారు. కానీ, ఆర్‌బీఐ చేసిన తనిఖీల్లో కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను కస్టమర్ క్వైరీలుగా వర్గీకరించిన సందర్భాలు గమనించాం. వాటిలో బ్యాంకుల అంబుడ్స్‌మన్ దాకా చేరకుండా వదిలేసిన ఫిర్యాదులను చూశామని దాస్ పేర్కొన్నారు. ఈ అంశాలను పరిశీలించాలని, బ్యాంకు బోర్డులు, వాటి కస్టమర్ సర్వీస్ కమిటీలను కోరుతున్నట్టు దాస్ వెల్లడించారు.