EATALA: కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-11-18 17:17:59.0  )
EATALA: కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని, కేసీఆర్(KCRBRS) కి పట్టిన గతే రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కూడా పడుతుందని మల్కాజ్‌గిరి(Malkajgiri) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అన్నారు. నర్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి బైటికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజన రైతులను, దళిత బిడ్డలను వందల మంది పోలీసులు విపరీతంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలుపాలు చేసినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎంపీ డీకే అరుణ(MP DK Aruna), బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి(BJLP leader ALET Maheshwar Reddy), తాను ఆ కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తుంటే అకారణంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు. అలాగే ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చూడలేదని, రేవంత్ రెడ్డికి ఆదర్శం కేసీఆర్ ఏమో.. అని మండిపడ్డారు.

గతంలో చిన్న పిలుపునిచ్చిన హౌస్ అరెస్ట్ పేరిట ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నియంతలా వ్యవహరించిన వారికి ప్రజలు ఏ గుణపాఠం చెప్పారో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అదే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అంతేగాక ప్రజాప్రతినిధులుగా మా విధులను ఆటంకం కలిగించిన వారి మీద పార్లమెంట్‌లో తప్పకుండా ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన రేవంత్ రెడ్డిని అడుగడుగునా నిలువరించే రోజు వస్తుందని, గత ప్రభుత్వం పతనం అవడానికి పది సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం తూ.. అనిపించుకోవడానికి ఏడాది కూడా పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నియంత్రత్వ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రాబోయే కాలంలో ప్రజలు సమైక్యమవుతారని హెచ్చరిస్తున్నానని తెలిపారు. బాస్ ల ఆదేశాలతో అధికారులు చట్టాన్ని, తమ పరిధిని మరిచిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. అవమానపరుస్తున్న వారికి తప్పకుండా రాబోయే కాలంలో శిక్ష ఉంటదని ఈటల సూచించారు.

Advertisement

Next Story