- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆలూరు నూతన మండలంలో సమస్యల తీష్ట...

దిశ,ఆలూరు : నిజామాబాద్ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటైన మండలాలలో ఆలూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఒకటి.ఆలూరు మండలం మండల పరిధిలోని 9 గ్రామ పంచాయతీలు ఉండగా ఈ పంచాయతీల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ మండల కేంద్రానికి వచ్చి పనులు కాక ముఖం చాటేసుకొని ఇండ్లకు తిరిగి వెళ్తున్నారు.ఆయా గ్రామాల నుండి వివిధ అవసరాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే వారికి కనీసం తాగడానికి త్రాగునీరు, మౌలిక వసతులు లేవని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస వసతులు లేవని మండలంలోని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాసిల్దార్ కార్యాలయ అధికారుల పై పని భారం..
ఆలూరు మండల కేంద్రంలో ఏర్పాటు అయిన తాసిల్దార్ కార్యాలయంలో అధికారుల లేమితో అధిక పనిభారం స్థానిక తాసిల్దార్ పై పడి ఆయన ఆరోగ్యం లో ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఇది ఆలూరు తాసిల్దార్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.సిబ్బంది కొరత కారణంగా, తహసీల్దార్ అనేక బాధ్యతలను స్వయంగా నిర్వహించాల్సి వస్తుంది. ఇది వారి పనిభారం పెంచుతోంది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో తాసిల్దార్ అలసత్వానికి గురికావాల్సి వస్తుంది.
సర్టిఫికెట్ కావాలంటే ఆగాల్సిందే..
ఏదైనా అత్యవసర పరిస్థితిలో క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సి ఇతర సర్టిఫికెట్లు కావాలంటే సిబ్బంది కొరత, కంప్యూటర్ లో సరిపడా లేకపోవడం వల్ల లేట్ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆదాయం, క్యాస్ట్ తదితర సర్టిఫికెట్ల కోసం వస్తు గంటలకు నిలబడాల్సిన పరిస్థితి తయారైంది.
వీఆర్ఏల (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు) ఉపయోగం..
సిబ్బంది కొరతను ఎదుర్కోవడానికి, తహసీల్దార్ కార్యాలయాలు వీఆర్ఏలను అదనపు బాధ్యతలతో నియమిస్తున్నాయి. వీఆర్ఏలు సాధారణంగా గ్రామ స్థాయి పనులను నిర్వహించేందుకు నియమించబడిన ప్పటికీ, సిబ్బంది కొరత కారణంగా, వారు తహసీల్దార్ కార్యాలయాలలో కూడా విధులు చేయాల్సి వస్తుంది. ఇది వీఆర్ఏలపై అదనపు పని భారం మోపుతుంది. వారి ప్రాథమిక బాధ్యతలను నిర్వర్తించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఆలూర్ లో ఖాళీ పోస్టులు..
తహసీల్దార్ కార్యాలయాలలో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ), సీనియర్ అసిస్టెంట్లు వంటి కీలక పోస్టులు ఆలూరు తాసిల్దార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్నాయి.
డిప్యూటేషన్ లో పనిచేస్తున్న ఆర్‌ఐ
ఆలూరు నూతన మండలానికి ఇటీవల డిప్యూటీషన్లో నియమతమైనా ఆర్‌ఐ. ఆర్‌ఐ మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు ఆర్డిఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఏదన్నా ఎమర్జెన్సీ పని ఉందంటే ఆర్డీవో కార్యాలయం నుండి ఆలూరు రావాల్సిందే , లేదంటే ప్రజలు ఆర్టీవో కార్యాలయానికి పోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఆలూరు మండల ప్రజలు పూర్తిస్థాయిలో ఆర్‌ఐ ని కొనసాగించాలని కోరుకుంటున్నారు.
గదుల కొరత.. శిధిలావస్థలో ఆర్ఐ కార్యాలయం...
ఆలూరు లో నూతన తహసీల్దార్ కార్యాలయం లేదు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త మండలాలకు అప్పటివరకు గ్రామంలో ఇతర కార్యక్రమాలకు కొనసాగించిన ప్రభుత్వ కార్యాలయాలను తాసిల్దార్ కార్యాలయంగా అప్పట్లో ప్రారంభించారు. దాంట్లోనే ఇప్పటివరకు ప్రస్తుతం ఆలూరు తహసిల్దార్ కార్యాలయం కొనసాగుతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్యాలయం పశువుల ఆరోగ్య ఆస్పత్రి. ఉన్న రెండు గదులతో నెట్టుకొస్తున్న తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది.ఏదైనా భారీ వర్షం కురిస్తే అంతే సంగతులు. ఈ భవనం కూలిపోవడం దాదాపు 100% జరుగుతుందేమో అన్న అనుమానాన్ని మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత కారణాలు..
సిబ్బంది కొరత, కంప్యూటర్లు సరిపడా లేకపోవడం కారణంగా, పౌరులు తమ భూమి రికార్డులు, పాస్‌బుక్స్, సర్టిఫికేట్లు వంటి సేవల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఆలూరు మండలం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం లో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త మండలాలలో సిబ్బంది నియామకాలను వేగవంతం చేయాలని, తహసీల్దార్ కార్యాలయాల పనితీరును మెరుగుపరచాలని ప్రజలు తాసిల్దార్ కార్యాలయ అధికారులు కోరుతున్నారు. అయితే, ఈ చర్యలు ఎంత త్వరగా అమలు చేస్తే, పౌరులకు అందించే సేవలు నాణ్యత ,వేగం లో మెరుగు పడనున్నాయి.
ఆలూరు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరతపై కలెక్టర్ కు లేఖ రాశాం..: రాజా గౌడ్,ఆర్మూర్ ఆర్డీవో
ఆలూరు నూతన మండలం లో సిబ్బంది కొరత ఉందని వాస్తవమే అని, పూర్తిస్థాయి సిబ్బంది కోసం జిల్లా కలెక్టర్ కు లేఖ రాశాం. త్వరలోనే పూర్తి సాయి సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తాం. కార్యాలయంలో ప్రజలకు కనీస వసతులను ఏర్పాటు చేయిస్తాం.