డబ్బులు ఇవ్వలేదని.. రైలులో యువకుడిని కొట్టి చంపిన హిజ్రాలు

by Mahesh |   ( Updated:2025-03-29 15:13:53.0  )
డబ్బులు ఇవ్వలేదని.. రైలులో యువకుడిని కొట్టి చంపిన హిజ్రాలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హిజ్రాలు (Hijras) రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా శుభాకార్యాలతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ హిజ్రాలు ఓ గ్యాంగ్ (gang) గా ఏర్పడి డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సంస్కృతి రైల్వేలో అత్యధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నార్త్ సైడ్ వెళ్లే రైల్లో హిజ్రాలు వీరంగం సృష్టిస్తున్నారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే.. రైలు కోచుల్లో నగ్నంగా అసభ్య ప్రవర్తనతో (Indecent behavior) ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే తాము అడిగినంత ఇవ్వకపోతే ఒంటరిగా ఉన్న వారిపై దాడులు కూడా చేస్తారు. ఇటీవల ఓ రన్నింగ్ రైల్లో డబ్బులు ఇవ్వలేదని ఓ ప్రయాణికుడిని దారుణంగా కొట్టి చంపారు (traveler was brutally beaten to death). ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఘటన రెండు వారాల క్రితం మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో చోటు చేసుకొగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదర్శ్ వర్మ గోండ్వాన ఎక్స్ ప్రెస్ (Adarsh ​​Verma Gondwana Express Train) లోకి ఎక్కిన హిజ్రాలు ప్రయాణికుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ.. వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన హిజ్రాల గ్యాంగ్ యువకుడి (Hijra gang attacks A Man)పై విచక్షణా రహితంగా దాడి చేశారు. కంపార్ట్మెంట్ (Compartment)లో అందరూ చూస్తుండగానే యువకుడిని కిందపడేసి దారుణంగా తొక్కుతూ, తంతూ దాడి చేయడంతో యువకుడి తీవ్రగాయాలతో మరణించాడు. అనంతరం యువకుడిని రన్నింగ్ రైలు నుంచి కింద పడేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Click For Tweet Post..

Next Story

Most Viewed