‘దిశ’ వరుస కథనాలు.. సీడబ్ల్యూసీ మేనేజర్ పై కేసుకు రంగం సిద్ధం

by Mahesh |
‘దిశ’ వరుస కథనాలు.. సీడబ్ల్యూసీ మేనేజర్ పై కేసుకు రంగం సిద్ధం
X

దిశ, మెదక్ ప్రతినిధి: కేంద్ర శాఖ అవినీతి బాగోతాన్ని గుట్టుగా ముసేద్దామని ప్రయత్నించినా, అక్రమార్కులపై అక్షర యుద్ధం చేసే ‘దిశ పత్రిక’ రట్టు చేసింది. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని గప్ చుప్ గా మూసేయాలని చూసిన ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది. సీడబ్ల్యూసీలో ఇంటి దొంగలు కథనం ప్రచురితం కావడంతో మెదక్ పట్టణ పోలీసులు దొరికిన బియ్యం లోడ్ డీసీఎం ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న మేనేజర్ పై కూడా కేసు పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని తప్పించేందుకు రాజకీయ నేతలు చేసిన ప్రయత్నం విఫలం కావడంపై చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో ఎంత మంది అధికారుల ప్రమేయం ఉంది. ఎన్నాళ్ళుగా తంతు సాగుతుందన్న, దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మెదక్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ నుంచి సోమవారం వాహనంలో అనుమతి లేకుండా తరలిన బియ్యంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సీజ్ చేశారు. అధికారులు బియ్యం తరలిస్తున్న విధానంపై తప్పుడు వివరాలు ఇచ్చే ప్రయత్నం చేయడంతో అధికార పార్టీ నేతలతో కేసు మాఫీకి తీవ్రంగా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కానీ, దిశ పత్రికలో ‘సీడబ్ల్యూసీలో ఇంటి దొంగలు’ అనే కథనం ప్రచురితం కావడంతో ఒక్కసారిగా అన్ని తలకిందులుగా మారిపోయాయి. సీడబ్ల్యూసీలో నుంచి బియ్యం దొంగతనంగా తరలిపోతున్నట్టు కథనం రావడంతో పోలీస్ లు పక్కగా విచారణ జరిపి కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు సైతం ప్రయత్నాలు విరమించుకున్నారు. 35 క్వింటాళ్ల బియ్యం తో పాటు లోడ్ తో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు పట్టణ సీఐ నాగరాజు వెల్లడించారు.

ఏండ్లుగా సాగుతున్న దందా..?

సీడబ్ల్యూసీలో దొంగతనంగా తరలిపోతున్న బియ్యం చిక్కడంతో ఆ శాఖ అధికారుల తీరుపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సెలవు దినాల్లో సైతం బియ్యం ప్రైవేటు వ్యక్తులకు తరలి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. మెదక్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాగన్ లలో బియ్యాన్ని తరలిస్తారు. అయితే ముందుగానే వాహనంలో పోవాల్సిన బియ్యం కంటే అధికంగా తరలించి అక్కడి నుంచి వేరే వాహనాల్లోకి మార్చి అక్కడి నుంచి మిల్లలకు తరలించి విక్రయాలు జరిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే గిడ్డంగులకు మిల్లర్ నుంచి వచ్చిన బియ్యాన్ని నాణ్యత లేదని పేరుతో రిజెక్ట్ చేసి బారి స్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్టు తెలిసింది. కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్న ఇందులో ఇంటి దొంగలు ఉండడం మూలంగా అసలు బాగోతం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇక్కడ జారుతున్న అక్రమాలు కొన్నాళ్లుగా పరిశీలిస్తున్న స్థానికులు 100 కు సమాచారం ఇచ్చి పట్టించిన సంగతి తెలిసిందే. పోలీసులకు పట్టుబడిన బియ్యం సుమారు 35 క్వింటాళ్ల ఉన్నట్టు చెప్పారు. వాటి విలువ దాదాపు రూ.2 లక్షల వరకు విలువ ఉంటుందని చెబుతున్నారు. ఇలా కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ గోదాం నుంచి ఎంత బియ్యం స్వాహా చేశారో తేలనుంది.

సీడబ్ల్యూసీ మేనేజర్ పై కేసుకు సిద్ధం.?

కేంద్ర గిడ్డంగుల సంస్థలో నుంచి సెలవు దినంలో బియ్యం తరలిపోయిన వ్యవహారంలో సంబంధిత శాఖ మేనేజర్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అనుమతి లేకుండా బియ్యం వాహనాన్ని గోదాం నుంచి బయటకు పంపేందుకు అనుమతి ఇవ్వడం మూలంగా ఇందులో ఆ అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అధికారుల ఆదేశాల మేరకు వాహనాన్ని బయటకు పంపి నట్టు సెక్యూరిటీ చెప్పడంతో ఇందులో పక్కగా అధికారుల ప్రోద్బలం వల్లే జరిగినట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని వ్యవహారంతో పాటు దొంగచాటుగా బియ్యం తరలింపు నెపం పై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల నుంచి తెలిసిన సమాచారం.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story