TGPSC: గ్రూప్ 3 ప్రశాంతం.. చివరి పరీక్షకు 50.24 శాతం హాజరు

by Ramesh Goud |
TGPSC: గ్రూప్ 3 ప్రశాంతం.. చివరి పరీక్షకు 50.24 శాతం హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రెండ్రోజులుగా జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలు(Group 3 Examinations) సోమవారం ముగిశాయి. చివరిరోజు పరీక్షకు కేవలం 50.24 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం 1363 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్​ కమిషన్(Telangana Public Service Commission) ఆదివారం రాత పరీక్షలు ప్రారంభించింది. గ్రూప్ 3 పరీక్ష కోసం మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం జరిగిన పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్(General Studies and General Abilities) కు 51.1 శాతం మంది, పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ(History, Polity and Society) పరీక్షకు 50.7 శాతం మంది హాజరయ్యారు. కాగా సోమవారం ఉదయం జరిగిన పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్ మెంట్(Economy And Development) ఎగ్జామ్ కు 2,69,483 అంటే 50.24 శాతం అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఇదిలా ఉండగా పేపర్ 3 లోనూ తెలంగాణ స్కీములపై పలు ప్రశ్నలు వచ్చాయి. హైడ్రా(HYDRA), రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల స్కీములు(Indiramma Housing Schemes), తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ(Telangana Skill University)పై, 2011 జనాభా లెక్కలు, ఐదో కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రశ్నలు రావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed