ఫొటో దిగడానికి డిస్టర్బ్ చేసిందని పెద్దపులికే చుక్కలు చూపించిన బుడ్డోడు.. నెట్టింట ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో

by Kavitha |
ఫొటో దిగడానికి డిస్టర్బ్ చేసిందని పెద్దపులికే చుక్కలు చూపించిన బుడ్డోడు.. నెట్టింట ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో వారు ఏడుస్తున్నది, నవ్వుతున్నవి, క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్నవి అలా చాలా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ క్యూట్ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది.

‘బ్యాటిల్ ఆఫ్ ది హ్యాండ్స్’ అనే క్యాప్షన్‌తో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ బుడ్డోడు జంతుప్రదర్శనశాలను సందర్శించాడు. అక్కడ ఒక పెద్ద పులిని బంధించిన ఆవరణలో ఈ చిన్నోడు జాలిగా నడుస్తూ వెళ్తున్నాడు. అలా వెళుతూ వెళుతూ పులి ఉన్న బోను గ్లాస్‌కు కాస్త ఒరిగి ఫోటోలకు పోజులిస్తున్నాడు. అలా గ్లాసు దగ్గరగా నిలబడి ఉన్న బాలుడిని వాసన చూసి పులి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ గాజు గోడ వారికి అడ్డుగా ఉంది. దీంతో పులి తన ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అలా పులి ఫేస్ తిప్పగానే వాడికి కోపం వచ్చిందనుకుంటా.. ఆ వెంటనే పిల్లవాడు తన రెండు చేతులతో ఆ గ్లాస్‌ను కొడుతూ ఉన్నాడు. అలా కొంత సమయం తరువాత, పులి కూడా తన ముందు రెండు కాళ్లతో గ్లాస్‌ను కొడుతోంది. అచ్చంగా ఆ బాలుడు చేస్తున్న పనిని పులి కూడా రిపీట్‌ చేస్తోంది. దీంతో ఈ వీడియో అయిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఇప్పటికే ఈ వీడియోను 26 మిలియన్ల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

(video link credits to Figen X account)

Advertisement

Next Story

Most Viewed