- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూనియర్ సివిల్ జడ్జి బదిలీ
దిశ హుజూర్ నగర్: తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తుల ఆదేశానుసారం హుజూర్ నగర్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న యన్. మంజులను హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న ఆమె న్యాయమూర్తుల ఎంపిక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై మొదటి పోస్టింగ్ లో హుజూర్ నగర్ కోర్టులో ఏప్రిల్ 2017న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో సౌమ్యురాలిగా, నిస్పక్షపాతిగా పేరు గడించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోదాడ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీదేవికి పూర్తి అదనపు భాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులలో పేర్కొన్నారు. కాగా బదిలీ పై వెళ్తున్న న్యాయమూర్తికి సోమవారం కోర్టు ప్రాంగణలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. న్యాయ వాదులంతా విధిగా హాజరు కావాలని వారు కోరారు.