హరిభూషణ్ ఇంట్లో మరో విషాదం?

by Sridhar Babu |   ( Updated:2021-06-26 00:46:16.0  )
హరిభూషణ్ ఇంట్లో మరో విషాదం?
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం‌లోని మడగూడెం గ్రామానికి చెందిన యాప నారాయణ చనిపోయిన నాలుగు రోజులు అవుతుంది. అయితే ఆ నాలుగవ రోజే ఆయన సహచరి జెజ్జరి సమ్మక్క అలియాస్ శారదక్క 24వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయంతో మడగూడెం, తల్లిగారి ఊరైనా గంగారాం విషాదంలో మునిగాయి. 25న శారదక్క అంత్యక్రియలు మవోయిస్టులు జరిపినట్లు కూడా తెలుస్తోంది.

Read More: మావోయిస్టు నేతకు కరోనా.. ఆన్‌లైన్‌లో చూసి అడవిలో వైద్యం

Advertisement

Next Story