హుజురాబాద్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇలా..

by Shyam |   ( Updated:2021-11-02 03:53:30.0  )
హుజురాబాద్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇలా..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రభావం నగర రోడ్లపై పడింది. ప్రతి నిత్యం వాహనాల రాకపోకలతో రద్ధీగా ఉండే హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలలో రోడ్లపై ఒక్క సారిగా ట్రాఫిక్ తగ్గిపోయింది. హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కు గత నెల 30వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 86 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంతో విజయం అధికార టీఆర్ఎస్ పార్టీదా, లేక బీజేపీని వరిస్తుందా ? కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి ఇలాంటి సందేహాలతో నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజలు మంగళవారం ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబర్చి టీవీలకు అతుక్కు పోవడంతో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గిపోయింది. కొంత మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సెలవులు పెట్టి టీవీల ముందు కూర్చున్నారు.

విధులకు హాజరైన వారు కూడా ప్రతినిమిషం వాట్సాప్, సోషల్ మీడియాలలో ఎన్నికల ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రౌండ్ రౌండ్ కు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుని మిత్రులతో ఫోన్ లలో విశ్లేషిస్తున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా సాధారణ ప్రజానీకం కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఆసక్తి కనబర్చారు. మొత్తం మీద ఈ ఉప ఎన్నికల ఫలితాలు నగర ప్రజలలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుండడంతో రోడ్లపై వాహనాల రద్ధీ లేకుండా పోయింది.

Advertisement

Next Story

Most Viewed