- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి: ఉత్తమ్
దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు రావటం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. గురువారం ఉత్తమ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ కరోనా పాజిటివ్‌లు వస్తాయని, అందుకే టెస్టులు తక్కువ చేస్తున్నారని ఆరోపించారు. కరోనా మరణాల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపిస్తున్నారని, హైదరాబాద్‌లో ప్రజలు భయాందోళన చెందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పని తీరుతో ప్రభుత్వాస్పత్రులపై జనాలకు నమ్మకం పోయిందని, ప్రైవేట్ ఆస్పత్రులపై సర్కార్‌కు నియంత్రణ లేదని ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చటం లేదో కేసీఆర్ చెప్పాలని, ఉస్మానియా ఆసుపత్రిని కాపాడుకోవాలని అన్నారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బందికి 50శాతం జీతం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు.