అరకు అందాలకు పర్యాటకులు ఫిదా

by srinivas |
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా
X

దిశ, విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు భారత దేశ నలుమూలల నుంచి వైజాగ్ అరకు అందాలను తిలకించడానికి భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. విశాఖ మన్యం అరకులోయ ప్రాంతంలో మంచు అందాలతోపాటు, వలిసె పూల అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు. కోవిడ్-19 దృష్ట్యా గత ఆరు నెలలుగా పర్యాటక ప్రాంతాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పర్యాటక శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యాటక కేంద్రాలు తెరిచేందుకు అనుమతులు ఇవ్వడంతో గత రెండు నెలలు నుంచి పర్యాటక కేంద్రాలు తోపాటు ప్రదేశాలు తెరుచుకున్నాయి.

ఆరు నెలల నుంచి పర్యాటక అందాలకు దూరం అయిన పర్యాటకులు పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఎక్కడిపడితే అక్కడ పిక్నిక్ సందడి మొదలైంది. ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలో బొర్రా, కటికి జలపాతం, పద్మాపురం గార్డెన్, చాపరాయి, సరియా, మత్స్యగుండం జలపాతం, గిరిజన మ్యూజియం, లంబసింగి పర్యాటక ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.


దీంతో పాటు అరకు ప్రాంతంలోని వలిసేపూల అందాలు, మంచు తెరల సోయగాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లోనే ఏజెన్సీలో గల పర్యాటక కేంద్రాలను పిక్నిక్ స్పాట్‌లు ఎంచుకొని పర్యాటకులు తరలివస్తుంటారు. రోడ్డు ఇరువైపులా వలిసెపూల అందాలు పర్యాటకులను కట్టి పడేస్తున్నాయి. ఈ పూల మధ్య ఫోటోలు సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు సంబురపడుతుంటారు. అరుకు, మంచు అందాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడపడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed