Breaking: భార్యతో పాటు మావోయిస్టు అగ్ర నేత ప్రశాంత్ బోస్ అరెస్ట్!

by Anukaran |   ( Updated:2021-11-12 04:11:09.0  )
Maoists Prashanth Bose, Sheela Marandi
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం ఏజెన్సీల్లో ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తోన్న సంగతి తెలిసిందే. బృందాలుగా విడిపోయి అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోగా, తాజాగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మావోయిస్టు పార్టీ అగ్ర నాయ‌కులు ప్రశాంత్ బోస్, ఆయ‌న భార్య శీలా మారండీని జార్ఖండ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం. ప్రశాంత్ బోస్ మావోయిస్టు సీనియ‌ర్ నాయ‌కుల‌లో ఒక‌రు.

మావోయిస్టు క‌మ్యూనిస్ట్ సెంట‌ర్ ఆఫ్ ఇండియా(MCCI) చీఫ్‌గా కొంతకాలం పాటు ప్రశాంత్ బోస్ కొన‌సాగారు. ఆయన భార్య శీలా మారండీ కూడా మావోయిస్టు పార్టీలో అగ్ర నాయ‌కురాలు. వీరిద్దరిని జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. 75 ఏండ్ల ప్రశాంత్ బోస్ గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా.. ప్రశాంత్ బోస్ ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్రల్ క‌మిటీ మెంబ‌ర్‌, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిల‌ట‌రీ క‌మిష‌న్, ఈస్ట్రన్ రీజిన‌ల్ బ్యూరో సెక్రట‌రీగా కొన‌సాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed