కోవిడ్-19 కొలువుల దరఖాస్తులకు ఈరోజే ఆఖరు

by Harish |   ( Updated:2020-04-03 01:24:12.0  )
కోవిడ్-19 కొలువుల దరఖాస్తులకు ఈరోజే ఆఖరు
X

వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో వైద్య సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల వారు ఇవాళ (ఏప్రిల్ 3) లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులకు health.telangana.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని సూచించింది. స్పెషలిస్టు వైద్యానికి రూ. లక్ష, ఎంబీబీఎస్ వారికి రూ. 40 వేలు, ఆయుష్ వైద్యునికి రూ. 35 వేలు, స్టాఫ్ నర్సుకు రూ. 23 వేలు, ల్యాబ్ టెక్నిషియన్‌కు రూ. 17 వేల వేతనం ఇవ్వనున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ బోధనాస్పత్రులకు అనుబంధంగా ఉన్న 18 చోట్ల అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 1645 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.

పూర్తి నోటిఫికేషన్ :

Tags: covid 19, health dept jobs, today last date, telanganagovt

Advertisement

Next Story