తన ఇల్లు కురవకుండా ఉండాలని.. ఏం చేశాడంటే

by Shyam |   ( Updated:2021-08-27 05:04:13.0  )
House
X

దిశ వెబ్‌డెస్క్: వర్షాల కారణంగా తన ఇల్లు కురుస్తున్నందున తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయని రాజీవ్ గృహకల్పకు చెందిన వృద్ధుడు కృష్ణ (73) పట్టణ వీధుల్లో వినూత్న నిరసన చేపట్టాడు. వివరాలు.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో మొదటి అంతస్థులో కృష్ణ నివాసం ఉంటున్నాడు. భారీ వర్షాల వలన మొదటి అంతస్థులో నివాసం ఉంటున్న ఇంటి పైకప్పు తీవ్రంగా కురుస్తున్నది. వర్షం నీరంతా ఇంటిలోపలికి వస్తున్నాయి. ఆ నీటిని కిందికి పారబోస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కుటుంబ సభ్యులతో తీవ్ర గొడవలు అవుతున్నాయి.

మా ఇంటి పైకప్పును కురవకుండా బాగుచేయాలని సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులను ప్లకార్డుకు అతికించి ప్రధాన రహదారుల గుండా తిరుగుతూ సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. వికారాబాద్ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార భారీ ర్యాలీ తీస్తున్న సమయంలో వృద్ధుని నిరసనతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చేతిలో తలగోరి పట్టుకొని, నుదుటిపై రూపాయి బిళ్ల పెట్టుకొని రామయ్యగూడ రోడ్డు నుండి ప్రధాన రోడ్ల వెంట నిరసన చేపట్టాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల్లో అనేకసార్లు ఇచ్చిన వినతి పత్రాలను పోస్టర్ పై అతికించి భుజానికి కట్టుకొని, అర్ధ నగ్న ప్రదర్శన చేస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed