- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మద్యం తాగి అలా ప్రవర్తించినందుకు ముగ్గురికి జైలు శిక్ష..

X
దిశప్రతినిధి, నిజామాబాద్ : మద్యం తాగి డ్రైవింగ్ చేసినందుకు గాను ముగ్గురికి ఒకరోజు సాధారణ జైలు శిక్ష పడింది. మంగళవారం నిజామాబాద్ కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ట్రైనీ కలెక్టర్ మకరంద్ ఈ మేరకు తీర్పునిచ్చారు.
వివరాల్లోకివెళితే.. నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన లైన్ గల్లీకి చెందిన మొహమ్మద్ ఆంజద్, కొజ్జా కాలనీకి చెందిన సుభాష్‌లు డ్రంకన్ డ్రైవింగ్‌లో పట్టుబడ్డారు. వీరిని ఈరోజు కోర్టులో హాజరుపరచగా ట్రైనీ కలెక్టర్ ఒకరోజు జైలు శిక్ష విధించారు.అదే విధంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపిన నాందేవ్ వాడకు చెందిన భగవాన్ దాస్‌కు కూడా ఒక్కరోజు జైలు శిక్ష పడిందని సీఐ చందర్ రాథోడ్ తెలిపారు.
Next Story