- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి పనితీరుకు నిదర్శనం ఈ రోడ్డు’
దిశ, జనగామ : జిల్లా కేంద్రంలోని ఆ రోడ్డుపై పోవాలంటే నరకం కనిపిస్తుందని వాహనదారులు వాపోతున్నారు. గత రెండు రోజుల క్రితం పడిన భారీ వర్షానికి జనగామ-సూర్యాపేట రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఇంతకు ముందున్న రోడ్డు సైతం ఇలానే ఉండేదని, రోడ్లపై అసంతృప్తితో మున్సిపాల్ శాఖ మంత్రి కేటీఆర్ తోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు వారణాసి పవన్ శర్మ ట్విట్టర్ లో రోడ్డు ఫోటోలతో సహా ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా పవన్ శర్మ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం బంద్ చేసి, జిల్లాలోని రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. పోద్దున లేస్తే రాత్రి వరకు నిత్యం ఎంతో మంది అధికారులు, నాయకులు, మంత్రులు సైతం ఈ రోడ్డులోనే ప్రయాణం చేస్తారన్నారు. అయినా రోడ్డు మరమత్తులను పట్టించుకోరని, ప్రభుత్వ పట్టింపుకు అధికారుల పనితీరుకు ఇది నిదర్శనమని ఆయన ఆరోపించారు.