ప్రధాని మోడీతో కేసీఆర్ కీలక భేటీలో చర్చించిన అంశాలివే..

by Anukaran |
KCR MOdi
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పన్నెండు అంశాలను మెమొరాండం రూపంలో నివేదించారు. ఐపీఎస్‌ల కోటా పెంచాలని, తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను మంజూరు చేయాలని, గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వాలని.. ఇలా మొత్తం పన్నెండు అంశాలపై విజ్ఞప్తి చేశారు.

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మోడీతో భేటీ అయిన కేసీఆర్ ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న సమయంలో, బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడానికి వెళ్లిన కేసీఆర్.. తొలుత ఎవరినీ కలవాలని అనుకోలేదని, అందువల్లనే మూడు రోజుల షెడ్యూలు ఖరారైందని, ఇప్పుడు రాష్ట్ర అవసరాల కోసం కలవాల్సి వచ్చిందని ఆ పార్టీ నేత సీతారాం నాయక్ వ్యాఖ్యానించారు.

తొమ్మిది నెలల క్రితం ఏకాంతంగా కలిసినట్లుగానే ఇప్పుడు కూడా ఒక్కరే వెళ్లి చర్చలు జరపడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానిని కలవాలని అనుకున్న గంటల వ్యవధిలోనే అపాయింట్‌మెంట్ దొరకడంపై చర్చలు మొదలయ్యాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా తప్పకుండా కలుస్తారని చర్చలు వచ్చినట్లుగానే వీరి భేటీ జరగడం విశేషం.

ప్రధానితో సీఎం చర్చించిన అంశాలు ఇవే..

* ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలి
* ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి
* హైదరాబాదు-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయాలి
* కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలి
* ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులు ఇవ్వాలి
* వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వాలి
* ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వాలి
* కరీంనగర్‌లో ట్రిఫుల్ ఐటీ మంజూరు చేయాలి
* హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి
* గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయాలి

Advertisement

Next Story

Most Viewed