దేశ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము

by Mahesh |   ( Updated:2025-01-01 12:49:42.0  )
దేశ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: 2025 న్యూ ఇయర్ సందర్భంగా భారత ప్రధాని మోడీ(Prime Minister Modi) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్(New Year) సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. అందులో.. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, విజయం, అంతులేని ఆనందాన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి. అని రాసుకొచ్చారు. ప్రధాని మోడీతో పాటు.. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా దేశ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ము(Draupadi Murmu) కూడా దేశ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దేశ స్థిరమైన భవిష్యత్తు కోసం కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed

    null