Lucknow: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన యువకుడు

by Shamantha N |
Lucknow: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. తల్లి, నలుగురు చెల్లెళ్లను చంపిన యువకుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: నూతన సంవత్సరం వేళ ఉత్తరప్రదేశ్‌లో(UP) దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో(Lucknow)లో అర్షద్‌ అనే వ్యక్తి తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హోటల్‌ గదిలో దారుణంగా హత్య చేశాడు. లక్నోలోని నాకా ప్రాంతంలో ఉన్న హోటల్ శరంజిత్‌కు అర్షద్‌(24) సహా కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ క్రమంలో అర్షద్‌ తన తల్లి, నలుగురు చెల్లెళ్లను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఈ ఘటనపై హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు అర్షద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అర్షద్‌ను విచారించగా.. కుటుంబ వివాదాల కారణంగానే తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హతమార్చినట్లు ప్రాథమికంగా అంగీకరించాడు. మరణించిన వారిని తల్లి అస్మా, అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించినున్నట్టు డీసీపీ తెలిపారు. అయితే, హత్యకు కుటుంబ వివాదాలే కారణంగా నిందితుడు అర్షద్‌ అంగీకరించినట్టు లక్నో పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు సాక్ష్యాలను సేకరించేందుకు క్రైమ్ స్పాట్‌లో మోహరించాయని.. దీనిపై విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ త్యాగి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed