- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. రాచకొండ సీపీ సుధీర్ బాబు..
దిశ, ఉప్పల్ : నూతన సంవత్సరంలో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల తనిఖీలలో భాగంగా రాచకొండ సీపీ సుదీర్ బాబు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సహకార పోలీసులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ రాచకొండ పోలీసుల తరఫున ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
రాచకొండ పరిధిలో 6000 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల సందర్భంగా న్యూ ఇయర్ కేక్ కటింగ్ లు చేయలేదన్నారు. రాచకొండ పరిధిలో 129 ఫాంహౌస్ లు, 35 రిసార్ట్ లు, 189 రెస్టారెంట్ లు ఉన్నాయని వాటికి పర్మిషన్ తీసుకున్నారన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నడుస్తున్నాయని, ఇది కంటిన్యూగా అవుతాయన్నారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేస్తున్నమన్నారు. ఈ వేడుకలు డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రత్యేకంగా డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని సూచించారు. న్యూ ఇయర్ ని అందరూ ఆహ్వానించాలి, మంచి ఉద్దేశంతో మంచి భవిష్యత్తు ముందుకు సాగాలని అన్నారు.