IND Vs AUS: బుమ్రా, సిరాజ్‌ల జోరు.. ఆస్ట్రేలియా టాపార్డర్ విలవిల

by Shiva |
IND Vs AUS: బుమ్రా, సిరాజ్‌ల జోరు.. ఆస్ట్రేలియా టాపార్డర్ విలవిల
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా సిడ్నీ (Sydney) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో భారత్ (India) పుంజుకుంది. తొలిరోజు 185 పరుగులకు టీమిండియా (Team India) ఆలౌట్ అయింది. 1 వికెట్ కోల్పోయి 19 పరుగుల ఓవర్‌ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్సింగ్స్‌‌ను ఆరంభించిన ఆసిస్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. మార్నస్ లబుషేన్ (Marnus Labushane) (2)‌ను కెప్టెన్ జస్ర్పీత్ బుమ్రా (Jasrpeet Bumrah) చక్కని లెంగ్త్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతోన్న సామ్ కోన్‌స్టస్‌ (Sam Constus) (23) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన డేంజరస్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ (Travis Head) కేవలం (4) పరుగులు మాత్రమే చేసి మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చేతికి చిక్కాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్టీవ్ స్మిత్, వెబ్‌స్టర్ ఇన్సింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా స్టీవ్ స్మిత్ (Steven Smit) (33) పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna) బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. భారత బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా 2, మహ్మద్ సిరాజ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టారు. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 5 కీలక వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. వెబ్‌స్టర్ (Beau Webster) 49 బంతుల్లో 28 పరుగులు, అలెక్స్ కేరీ (Alex Carey) 9 బంతుల్లో 4 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed