మరోసారి కేటీఆర్‌కు నోటీసులు పంపనున్న ఏసీబీ

by Mahesh |
మరోసారి కేటీఆర్‌కు నోటీసులు పంపనున్న ఏసీబీ
X

దిశ, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) విచారణ క్రమంలో బంజారాహిల్స్‌లోని ఏసీబీ (ACB) కార్యాలయం వద్ద సోమవారం ఉదయం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్(KTR) తనతో పాటు లాయర్లను తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆఫీసు ముందే కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో తాన లాయర్లను అనుమతిస్తేనే విచారణకు వస్తానని చెప్పి.. అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్ ఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులపై రిప్లై(Reply) ఇస్తూ లేఖ రాశారు. అందులో హైకోర్టు(High Court) తీర్పు వచ్చేంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలని కేటీఆర్ కోరారు. కాగా కేటీఆర్(KTR) ఇచ్చిన రిప్లై ఆధారంగా మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు(ACB officials) సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని రాష్ట్ర ప్రజలతో పాటు, బీఆర్ఎస్ కార్యకర్తంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story