- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలికలు ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలి.. కాంగ్రెస్ నాయకులు
దిశ, తలకొండపల్లి : నేటి సమాజంలో ప్రతి ఆడపిల్ల ప్రతినిత్యం, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ జీవన గమనంలో ముందుకు వెళ్లాలని మండల ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు బోల యాదగిరి అన్నారు. కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల పాఠశాలను సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల ఆవరణ చుట్టు అపరిచిత వ్యక్తులు, అల్లరి చిల్లరగా తిరిగే వారు విద్యార్థులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే స్థానిక ఉపాధ్యాయులకు లేదా సిబ్బంది ద్వారా స్థానిక నాయకులకు, అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా హాస్టల్ లో విద్యార్థినుల వాష్ రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. అదే విధంగా పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మ నరసింహ, ఇటమోని మల్లేష్, పొతూగంటి గణేష్, ఆవంచా నరసింహారెడ్డి, యాదగిరి, పోతుగంటి మల్లేష్, పురుషోత్తం, సురేష్, రాజశేఖర్ రెడ్డి, కటిక వెంకటేష్, రాఘవేందర్ రెడ్డి, పెరుమండ్ల మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.