Hyd: అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ

by srinivas |   ( Updated:2025-01-06 07:05:12.0  )
Hyd: అందుబాటులోకి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెడ్ డెస్క్: ఆధునాతన, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Charlapally Railway Terminal)ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోడీ(Pm Modi) ఢిల్లీ(Delhi) నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రారంభించి, అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టెర్మినల్‌ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి నిత్యం పెరగడంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను రైల్వే శాఖ నిర్మించింది. దాదాపు రూ. 413 కోట్లతో ఎయిర్ పోర్టును తలపించేలా మొత్తం ఫ్లాట్ ఫామ్‌లతో ఈ టెర్మినల్‌ను నిర్మించారు.

Read More: Kishan Reddy: రైల్వే శాఖలో సంస్కరణలు తీసుకొచ్చాం.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story