PUSHPA-2: చ‌రిత్ర సృష్టించిన ‘పుష్ప-2’.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి చిత్రంగా..(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-01-06 10:50:56.0  )
PUSHPA-2: చ‌రిత్ర సృష్టించిన ‘పుష్ప-2’.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి చిత్రంగా..(పోస్ట్)
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా ‘పుష్ప-2’. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. అంతేకాకుండా ఎన్నో రికార్డులు కూడా సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1799 ప్లస్ గ్రాస్ కలెక్షన్లతో తగ్గేదేలే అంటుంది. ఈ క్రమంలో ఈ చిత్రం తన ఖాతాలో మరో రికార్డు వేసుకుంది.

హిందీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పుష్ప-2 మూవీ.. ప్రస్తుతం రూ.806 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం విడుదల అయిన 31 రోజుల్లోనే ఈ సినిమా 800 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ తెలియజేస్తూ.. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీనిపై నెటిజన్లు, బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story