Minister Seethakka: ర‌మేష్ బిధూరి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపాటు

by Y. Venkata Narasimha Reddy |
Minister Seethakka: ర‌మేష్ బిధూరి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపాటు
X

దిశ, వెబ్ డెస్క్ : తనను గెలిపిస్తే నియోజకవర్గం రోడ్లను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బుగ్గల మాదిరిగా చేస్తానంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి సీఎం అతిషిపై పోటీ చేస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ(Bjp) అభ్యర్థి ర‌మేష్ బిధూరి(Ramesh Bidhuri) చేసిన అభ్యంతరకర వ్యాఖ్య(Controversial Comments)లు సంస్కారరహితమని మంత్రి సీతక్క(Minister Seethakka) మండిపడ్డారు. ప్రియాంకా గాంధీపై రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు యావ‌త్ మ‌హిళా లోకానికే అవ‌మానక‌రమని విమర్శించారు. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిధూరిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లకు టికెట్లు ఇస్తే మ‌హిళ‌లు స్వేచ్చగా, నిర్భయంగా తిర‌గ‌గ‌ల‌రా? అని, బీజేపీ మ‌హిళా వ్యతిరేక‌త‌ను అణువనువునా నింపుకుందని సీతక్క విమర్శించారు.

ఒక మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చి త‌న‌ దుర్బుద్ధిని, పురుష దురంకారాన్ని బీజేపీ బ‌య‌ట‌పెట్టుకుందన్నారు. బీజేపీకి మ‌హిళ‌లు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. మను ధర్మ శాస్త్రాన్ని అవలంభించడమే బీజేపీ మూల సిద్ధాంతమని, మను ధర్మ శాస్త్రంలో మహిళలను గౌరవించిన చరిత్ర లేదని, అందుకే మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం బీజేపీకి తెలియ‌దని విమర్శించారు. కాగా ఇప్పటికే ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల రమేష్ బిధూరి క్షమాపణలు ప్రకటించగా..సీఎం అతిషిపై తండ్రినే మార్చిందంటూ మరోసారి నోరుపారేసుకున్నారు.

Advertisement

Next Story