న్యూ ఇయర్ వేళ అత్యంత దారుణ ఘటన.. తల్లితో పాటు నలుగురు చెల్లెల్ని హత్య చేసిన కిరాతకుడు

by Mahesh |   ( Updated:2025-01-01 05:35:44.0  )
న్యూ ఇయర్ వేళ అత్యంత దారుణ ఘటన.. తల్లితో పాటు నలుగురు చెల్లెల్ని హత్య చేసిన కిరాతకుడు
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త సంవత్సరం వేల అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి కొడుకు తల్లితో పాటు నలుగురు చెల్లెల్ని హత్య(Murder) చేశాడు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నో(Lucknow)లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన తన కుటుంబ సభ్యులతో కలిసి అర్షద్(Arshad) లక్నోకు వచ్చాడు. అక్కడ ఓ హోటల్ గదిలో తన తల్లితో పాటు.. మరో నలుగురు చెల్లెల్ని హత్య చేశాడు. ఇది గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అర్షర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో గత కొంత కాలంగా కుటుంబంలో జరుగుతున్న కలహాల కారణంగా వారిని హత్య చేసినట్లు నిందితుడు అర్షర్ ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed