Trending: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. రికార్టు స్థాయిలో కండోమ్స్ అమ్మకాలు

by Shiva |   ( Updated:2025-01-01 05:45:23.0  )
Trending: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. రికార్టు స్థాయిలో కండోమ్స్ అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో న్యూ ఇయర్ (New Year) వేడుకలు ఆకాశాన్నంటాయి. ఎల్లలు లేని ఉత్సాహంతో కుర్రకారు సంబురాల్లో మునిగిపోయింది. కొందరు కల్చరల్ ప్రోగ్రాం (Cultural Program)లకు అటెండ్ అయి ఎంజాయ్ చేస్తే.. మరికొందరు తమకు ఇష్టమైన ఫుడ్ (Food) ఆరగించి కొత్త ఏడాదికి వెల్‌కం చెప్పారు. మరికొందరు ఫుల్లుగా మద్యం తాగి డిజే మోతతో డాన్సులు చేశారు.

ఈ క్రమంలోనే హైదరాబాదీలు (Hyderabadis) న్యూ ఇయర్‌ను శృంగారంతో స్టార్ట్ చేయాలని అనుకున్నారో ఏమో ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ (Swiggy Instamart')లో నిన్న ఒక్కరోజే భారీగా కండోమ్ ప్యాకెట్ల (Condom Packets)కు ఆర్డర్లు వచ్చినట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5.30 వరకు 4,779 కండోమ్స్ ప్యాకెట్లు బుక్ చేసినట్లుగా స్విగ్గీ తెలిపింది. అదేవిధంగా వాటితో పాటు రాత్రి 7.30 వరకు 2.21 లక్షల చిప్స్ ప్యాకెట్లు (Chips Packets) అమ్ముడైనట్లుగా వారు పేర్కొన్నారు. అయితే, బుధవారం రాత్రి వచ్చిన ఆర్డర్లలో ప్రతి ఎనిమిది మందిలో ఒకటి ఇతరుల కోసం ఆర్డర్ చేసినవని, ఆర్డర్లు మదర్స్‌ డే (Mothers Day), వాలెంటైన్స్ డే (Valentine's Day)లను కూడా అధిగమించాయని ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed