Gold Prices Today: కొత్త సంవత్సరం నాడు మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు

by Anjali |
Gold Prices Today: కొత్త సంవత్సరం నాడు మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతిరోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా.. మరోసారి నిరాశకు గురవుతుంటారు. కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు చూసినట్లైతే..

హైదరాబాదులో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 71, 500(నిన్నటి ధర రూ. 71,100)

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 78,000(నిన్నటి ధర రూ. 77, 560)

విజయవాడలో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 71, 500(నిన్నటి ధర రూ. 71,100)

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 78,000(నిన్నటి ధర రూ. 77, 560)

Advertisement

Next Story

Most Viewed