Ponnam Prabhakar : గురుకులాల నిర్వహణలో అలసత్వం సహించను : పొన్నం

by Y. Venkata Narasimha Reddy |
Ponnam Prabhakar : గురుకులాల నిర్వహణలో అలసత్వం సహించను : పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : నేను మీ అందరి వాడినని...గురుకులాల నిర్వహణ(Management of Gurukuls)లో అలసత్వం(Laziness)వహిస్తే మాత్రం సహించేది లేదని ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పష్టం చేశారు.బీసీ సంక్షేమ శాఖ జూమ్ మీటింగ్ రివ్యూల గురుకులాల సమస్యలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్ లు తనీఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. భోజనం, వసతి సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్ తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. ఆర్థికాభివృద్ధి కోసం ఫెడరేషన్లు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సూచించారు. విశ్వకర్మ పథకం లబ్దిదారులను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో మంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed