ఢిల్లీలో ఏప్రిల్ 20 తర్వాత సడలింపులుండవ్ : కేజ్రీ

by vinod kumar |
ఢిల్లీలో ఏప్రిల్ 20 తర్వాత సడలింపులుండవ్ : కేజ్రీ
X

న్యూఢిల్లీ : ఈ నెల 20వ తేదీ తర్వాత ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు ఉండబోవని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వారంలోపు నిపుణులను సంప్రదిస్తామని చెబుతూ.. అప్పటి వరకు లాక్‌డౌన్ సడలింపులు లేవని తెలిపారు. రెండో దఫా లాక్‌డౌన్‌ను ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 20వ తేదీ తర్వాత కొన్ని సడలింపులు ఇస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ తేదీపై నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. కాగా, ఢిల్లీ మాత్రం ముందుగానే స్పందిస్తూ.. ఇక్కడ సడలింపులు ఉండబోవని సీఎం కేజ్రీవాల్ వివరించారు. ‘ఢిల్లీ.. దేశరాజధాని. చాలా మంది ఇక్కడకు వస్తారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. నాకు కూడా లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వాలనే ఉన్నది. కానీ, ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే పరిస్థితులు అలా లేవు. ఢిల్లీలో లాక్‌డౌన్ సడలింపులు లేవు. ఈ విషయమై నిపుణులతో వారంలోపు భేటీ అవుతాం. అప్పటి వరకు ఇక్కడ సడలింపుల్లేవ’ని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

Tags: delhi, cm arvind kejriwal, no easing, relaxation, lockdown, april 20

Advertisement

Next Story