కేటీఆర్‌ను అడ్డుకున్న ఆ కుటుంబం

by Shyam |
కేటీఆర్‌ను అడ్డుకున్న ఆ కుటుంబం
X

దిశ, మహబూబ్‌నగర్: మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న వీర‌న్న‌పేట్‌లో 660 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్రారంభించారు. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో మంత్రి కాన్వాయ్ ను ఓ కుటుంబం అడ్డుకుంది. త‌మ భూమిని క‌బ్జా చేసి టీఆర్ఎస్ నేత‌లు డ‌బుల్ బెడ్ రూం క‌ట్టార‌ని, ఇదేంటనీ అడిగితే బెదిరిస్తున్నార‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబం మంత్రిని క‌ల‌వ‌కుండానే స్థానిక పోలీసులు ఆ కుటుంబాన్ని ప‌క్క‌కు ఈడ్చి ప‌డేశారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వారిపట్ల వ్యవహరించిన తీరు స్థానిక ప్ర‌జ‌లను ఆగ్రహానికి గురిచేస్తోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న స్థానిక టీఆర్ఎస్ నేత‌ల ఆగ‌డాల‌కు చెక్ పెట్ట‌క‌పోతే ఇంకేంత మంది భూములు క‌బ్జా చేస్తారోనంటూ మండిప‌డుతున్నారు.

Advertisement

Next Story