అప్పగింతల్లోనే పెళ్లి కూతురు మృతి

by Shamantha N |
అప్పగింతల్లోనే పెళ్లి కూతురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి రెండక్షరాలే అయిన ఇద్దరు వ్యక్తుల నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. పెళ్లి అనగానే ఎన్నో తంతులు ఉంటాయి. అందులో ఒకటి అప్పగింతలు. ఈ అప్పగింతలు అంటేనే వధువుకు ఎంతో బాధకరమైనవి. ఇరవై సంవత్సరాలు గారాబంగా చూసుకున్న తల్లిదండ్రులు, తాను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటిని, తన చిన్ననాటి మిత్రులని వదలి వెళ్తూ వధువు చాలా ఏడుస్తుంది. అప్పగింతల్లో తన కూతురికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పుచేస్తే సర్దుకుపోవాలంటూ కూతురిని అల్లుడి చేతిలో పెడుతారు. ఈ సమయంలో వధువు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాతం అవుతారు.

అయితే ఇలా అప్పగింతలు జరిగే సమయంలో ఓడిషా రాష్ట్రంలో ఓ ఘటన చోటు చేసుకుంది.సోనపూర్ జిల్లా గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడితో వివాహం అయినది. తర్వాత అప్పగింతలో భాగంగా వధువుని అత్తారింటికి పంపిచడానికి అన్ని ఏర్పాట్ల చేశారు. ఆ సమయంలో వధువు చాలా ఏడుస్తూ సృహ కోల్పోయింది. దీంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసి అప్పగింతల్లో అతిగా ఏడవటం వలన గుండెపోటు వచ్చి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed