- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాల్లో ఏపీ ప్రభుత్వ ఆదేశాలు!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని దేవాలయాలను వ్యక్తి పూజలకు నిలయాలుగా మార్చేలా ఏపీ ప్రభుత్వం వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఏపీ దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే అందులో 18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటీవల స్వరూపానంద, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రలకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు. నాడు దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఆ విమర్శల నుంచి ఇంకా బయటపడకముందే, స్వరూపానంద స్వామి విషయంలో మరో వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది.