- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ స్టీల్ ప్లాంట్: ఉద్రిక్తంగా మారిన ఆందోళనలు
దిశ, వెబ్‌డెస్క్: ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పుపడుతూ ఏపీలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా ఉద్యమం జరుగుతుండగా.. కేంద్రం మాత్రం మెట్టు దిగడం లేదు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని సోమవారం కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేసింది. దీంతో ఏపీలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.
కేంద్ర ప్రకటనతో విశాఖ ఉడికిపోతోంది. కేంద్ర ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ ఆర్చీ ముందు అర్థరాత్రి నుంచి ఆందోళనకారులు నిరసన చేపడుతుండగా.. తాజాగా రోడ్లపైన టైర్లను తగలబెట్టి నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ఆడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని కార్మికులు ముట్టడించగా.. డైరెక్టర్ వేణుగోపాల్‌పై ఆందోళనకారులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.