భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

by Anukaran |   ( Updated:2020-12-20 22:55:20.0  )
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. కొమురంభీమ్ జిల్లా గిన్నెదరిలో 4.3 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. తాంసిలో 4.9, అర్లి(టీ)లో 4.6, బేలా, మొమిన్‌పేటలో 5.0, కోహిర్ 5.1, సొనాలలో 5.3, నేరడిగొండలో 5.4, అల్గోల్, జైనాథ్‌లో 5.6, మార్‌పల్లెలో 5.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక సిర్పూర్ (యు), బరంపూర్‌, డోంగ్లీ, అదిలాబాద్ అర్బన్‌లో 6.0, భోరజ్‌లో 6.1, పెంబి, నల్లవల్లిలో 6.2, నర్సాపూర్, కేరమెర్రిలో 6.4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మరోవైపు విశాఖ ఏజేన్సీలోనూ చలిపంజా విసురుతోంది. చింతపల్లి, లంబసింగిలో 6.5, మినుములూరులో 8, అరకు, పాడేరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి చల్లనిగాలులు వీస్తుండడంతో పిల్లలు, వృద్ధులు, రోడ్లపై నుంచి వెళ్తున్న వాహనదారులు చలికి వణికిపోతున్నారు. మంచుకారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story