- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చదువుతోనే మంచి భవిష్యత్తు.. కలెక్టర్ మను చౌదరి..

దిశ, కోహెడ : చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థినీ విద్యార్థులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మన చౌదరి సూచించారు. గురువారం కోహెడ మండలంలోని శనిగరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 6 నెలల క్రితం ఈ స్కూల్ కి వచ్చినప్పుడు టీఎస్ ఐజీ డైరెక్టర్ తో మాట్లాడి సేల్స్ ఫోర్సెస్ సంస్థ, నిర్మాన్ ఎన్జీఓ సంస్థ సహకారంతో 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశామని అన్నారు. మీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు అధికంగా లబ్ది పొందేలా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులు మీకు వచ్చిన ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీకు ఉన్న ఇబ్బందులను పక్కన పెట్టి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని, అర్ధం కానపుడు ఖచ్చితంగా టీచర్స్ కు ప్రశ్నలు వేసి తెలుసుకోవాలన్నారు. పరీక్షల్లో మార్కులు ముఖ్యం కాదు సబ్జెక్ట్ ను సంపూర్ణంగా అర్ధం చేసుకొని నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు. మేమంతా కష్టపడడంతోనే ఉన్నత స్థానానికి వచ్చామని, రేపు 10 వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షల్లో అందరూ పాసై 10 జీపి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, కోహెడ తహసీల్దార్ సురేఖ, ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కో ఆర్డినేటర్ రామస్వామి, ఎంఈఓ పద్మయ్య, పాఠశాల హెచ్ఎం సరళ, తెలంగాణా సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్, నిర్మాన్, సేల్స్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కిరణ్మై, మాధురి, పాఠశాల, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.