తిరుమలలో అక్రమంగా నివసిస్తున్న వారి పై కొరడా

by Jakkula Mamatha |
తిరుమలలో అక్రమంగా నివసిస్తున్న వారి పై కొరడా
X

దిశ,తిరుమల: తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. రెండు రోజుల క్రితం తిరుమలలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. గత నెలలో తిరుమల లోని ఓ హోటల్ లో పని చేస్తున్న యువకుల మధ్య గొడవ కత్తిపోట్లు దారితీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనధికారికంగా, సరైన పత్రాలు లేకుండా తిరుమలలో ఉంటున్న వారిని గుర్తించి, వారిని వాహనాల్లో తిరుపతికి తరలించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story