ఆన్లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపాలి

by Naveena |
ఆన్లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపాలి
X

దిశ, సిద్దిపేట అర్బన్ :ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పీడి యాక్టులు పెట్టి అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ నిషేదించాలని బీఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో.. ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించి మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల నుండి యువతను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసలై ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆన్ లైన్ బెట్టింగ్ ను నిషేధించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంతోమంది యువత ,విద్యార్థులు ఉద్యోగస్తులు బెట్టింగ్ యాప్స్ బారినపడి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. షార్ట్ కట్ మెథడ్స్ తో ఆర్థికంగా ఎదగాలని ఆలోచనకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story