Gaddar Awards: గద్దర్ అవార్డులపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన

by Prasad Jukanti |
Gaddar Awards: గద్దర్ అవార్డులపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులు (Gaddar Award) ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన సంగతి తెలసిందే. వచ్చే నెలలో భారీ ఎత్తున ఈవెంట్ ను నిర్వహించి అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డులపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council) స్పందించింది. గద్దర్ అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ ఇవాళ ప్రకటన విడుదల చేశారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ్ కళాకారులు, సాంకేతిక నిపుణులకు తెలుగు చలన చిత్రం పరిశ్రమలోని ప్రముఖులు, గొప్ప వ్యక్తులైన ఎన్టీఆర్, పైడి జైరాజ్, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లు మీద “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” ను ప్రదానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed