Chiranjeevi: దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవంటూ చిరు ఎమోషనల్ ట్వీట్.. అసలు కారణం అదేనా?

by Hamsa |   ( Updated:2025-03-20 14:33:52.0  )
Chiranjeevi: దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవంటూ చిరు ఎమోషనల్ ట్వీట్.. అసలు కారణం అదేనా?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ఇటీవల ఆయన పద్మ విభూషణ్ అవార్డును కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘విశ్వంభర’ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని మెగాస్టార్‌కు అందించింది. ప్రస్తుతం అవే వార్తలు, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతుండటంతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా,జీవిత సాఫల్య అవార్డ్ అందుకోవడంపై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చాలా మంది గౌరవనీయ పార్లమెంటు సభ్యులు, మంత్రులు & అండర్ సెక్రటరీలు, దౌత్యవేత్తలు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతతో హృదయం నిండిపోయింది. వారి దయగల మాటలతో వినయంగా ఉంది. టీమ్ బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాను. దాని గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవు.

కానీ నా అద్భుతమైన అభిమానులు,బ్లడ్ సోదరులు, బ్లడ్ సోదరీమణులు, నా సినిమా కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులందరికీ, నా ప్రయాణానికి అన్ని విధాలుగా సహకరించిన నేను పోరాడుతున్న మానవతావాద కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నా పనిని మరింత శక్తితో కొనసాగించడానికి నన్ను ప్రేరేపిస్తుంది. మీ అందమైన అభినందన సందేశాలు పంపిన వారందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని రాసుకొచ్చారు. అలాగే పలు ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక ఆ పోస్ట్ చూసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందరూ కంగ్రాట్స్ చెబుతూ చిరు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

READ MORE ...

ఆయన నాకు అన్యయ్యే కాదు..! చిరంజీవి యూకే పార్లమెంట్ అవార్డ్ అందుకోవడంపై పవన్ కళ్యాణ్








Next Story